English | Telugu
2025 రౌండప్.. బాక్సాఫీస్ విన్నర్ ఎవరు..?
Updated : Dec 28, 2025
2025 ముగింపుకి వచ్చేసింది. చిన్న పెద్ద కలిపి ఈ ఏడాది తెలుగులో దాదాపు 200 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో విజయం సాధించినవి 20 లోపే ఉన్నాయి.
ఈ సంవత్సరం టాలీవుడ్ కి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. కానీ, అందులో ఒక్కటి కూడా రూ.500 కోట్ల క్లబ్ లో చేరలేదు.
ఈ ఏడాది రెండు సినిమాలు మాత్రమే రూ.300 కోట్ల క్లబ్ లో చేరి, అవే టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి. వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం.. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న విడుదలై అంచనాలకు మించిన సంచలనాలు సృష్టించింది. దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి, రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. (Sankranthiki Vasthunam)
'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత 2025లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా 'ఓజీ' అని చెప్పవచ్చు. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్.. 2025 సెప్టెంబర్ 25న విడుదలై రూ.300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఈ మూవీ పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. (They Call Him OG)
మొత్తానికి 2025లో 'ఓజీ'తో పవన్ కళ్యాణ్, 'సంక్రాంతికి వస్తున్నాం'తో వెంకటేష్ బాక్సాఫీస్ విన్నర్స్ గా నిలిచారు.