English | Telugu

A11గా అల్లు అర్జున్‌.. ‘పుష్ప2’ కేసులో దాఖలైన ఛార్జిషీట్‌!

2024 డిసెంబర్‌ 5న అల్లు అర్జున్‌ సినిమా ‘పుష్ప2’ విడుదలైంది. ఈ సందర్భంగా డిసెంబర్‌ 4న వేసిన ప్రీమియర్‌ షో సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గర భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఘటన గత ఏడాది తీవ్ర సంచలనం సృష్టించింది.

సంవత్సరం తర్వాత ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్‌తోపాటు మరో 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. థియేటర్‌ యాజమాన్యంతో పాటు, బన్నీ మేనేజర్‌, వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను ఛార్జ్‌ షీట్‌లో చేర్చారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. సంధ్య థియేటర్‌ యాజమాన్యాన్ని A1గా, అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు. అందర్నీ కలచివేసిన తొక్కిసలాట ఘటనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.