English | Telugu
సీక్వెల్ గురించి హాట్ అప్‌డేట్ ఇచ్చిన ‘గాడ్‌ఫాదర్’ డైరక్టర్
Updated : Aug 22, 2023
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా గాడ్‌ఫాదర్. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. తెలుగులోనూ మంచి పేరే వచ్చింది గాడ్‌ఫాదర్ సినిమాకు. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్‌తో డీసెంట్‌గా తీశారని అందరూ మెచ్చుకున్నారు. కలెక్షన్ల పరంగా కూడా అందరూ హ్యాపీనే. ఈ సినిమా తర్వాత మోహన్‌రాజా నెక్స్ట్ ఏం చేస్తారని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ గురించి హాట్ అప్‌డేట్ ఇచ్చేశారు మోహన్ రాజా. తన సోదరుడు జయం రవి హీరోగా తమిళంలో తని ఒరువన్ సినిమాను తెరకెక్కించారు మోహన్ రాజా. జయం రవికి జోడీగా ఆ సినిమాలో నయనతార నటించారు.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా విడుదలై మూడేళ్లయిన సందర్భంగా తని ఒరువన్‌కి సీక్వెల్ ఉంటుందని స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు అన్నదమ్ములు. ఆ తర్వాత ఇద్దరికి ఇద్దరూ బిజీ అయిపోయారు. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ చాప్టర్ 1, పొన్నియిన్ సెల్వన్ చాప్టర్2 సినిమాల్లో నటించారు జయం రవి. ఇటు మోహన్‌రాజా కంప్లీట్‌గా గాడ్‌ఫాదర్ సినిమాలో మునిగిపోయారు. అందుకే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ సినిమా గురించి ఓపెన్ అవుతున్నారు అన్నదమ్ములు. తని ఒరువన్2 కోసం ఇవాళ్టి నుంచి చెన్నైలో టెస్ట్ షూట్ చేయబోతున్నారు. ఆగస్టు 28 న సినిమా గురించి అఫిషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నారు. తని ఒరువన్ విడుదలై ఎనిమిదేళ్లయిన సందర్భంగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.