English | Telugu

శివాజీ గారు చెప్పింది కరెక్ట్ .. చనిపోవడానికి నేను సిద్దమే!

ఆర్జీవీ బ్యూటీ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఆరియానా. అలాంటి ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ గా కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. "నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు" అని హోస్ట్ అడిగేసరికి "మా అమ్మ నన్ను క్రిస్టియన్ లా పెంచింది కానీ నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. "నీకిష్టమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి నీకేం కావాలి వెంటనే ఇస్తాను అని అడిగితే ఎం కోరుకుంటావ్" అని హోస్ట్ అడిగింది. "నన్ను తీసుకెళ్ళిపోమంటాను అంటూ షాకింగ్ మాటలు చెప్పింది. "నిజం సీరియస్ గా చెప్తున్నా దేవుడే వచ్చిన తర్వాత ఇంకేం కావాలి..నేను ఈ నిమిషం చనిపోయినా పర్లేదు" అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.

రీసెంట్ గా ట్రెండింగ్ టాపిక్ గా మారిన శివాజీ కామెంట్స్ మీద హోస్ట్ అడిగింది. "శివాజీ గారు చెప్పింది కరెక్ట్ కానీ ఆయన వాడిన పదాల వలన అది వైరల్ అవుతున్నట్టుగా ఉంది కానీ..ఎవరి ఇష్టం వారిది. ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు రోగాలొస్తాయో ఎవరికీ తెలీదు టెన్షన్ ఎందుకు" అంటూ కూల్ గా ఒక పాట కూడా పాడింది. "అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని నీకు ఎలా అనిపించింది" అని హోస్ట్ అడిగింది. "లైఫ్ లో పర్టికులర్ గా ఏదన్నా జరగాలి అంటే రాసిపెట్టి ఉంటుంది. అలా నేను మా చెల్లి టీవీ చూస్తుంటే యాంకర్ లు కావలెను అంటూ కనిపించింది అలా వెళ్లాం" అని చెప్పింది. ఇక తన కెరీర్ లో ఎదుర్కున్న కష్టాల గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఆరియానా.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.