English | Telugu
మృణాల్ తో పండగ చేసుకుంటున్న విజయ్!
Updated : Nov 12, 2023
'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఫ్యామిలీ స్టార్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్.
ఇటీవల విడుదలైన 'ఫ్యామిలీ స్టార్' గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి దీపావళి శుభాకాంక్షలతో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో విజయ్, మృణాల్ క్రాకర్స్ కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న "ఫ్యామిలీ స్టార్" 2024 సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.
గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కేయూ మోహనన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.