English | Telugu
గర్భవతిని కాదు..నమ్మండి!
Updated : Feb 17, 2014
బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యాబాలన్ గర్భవతి అయ్యిందని, అందుకే తరచుగా హాస్పిటల్స్ కి వెళ్తోందని రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. విద్యాబాలన్ తన బరువు తగ్గించుకోవడానికే డాక్టర్ల దగ్గరకు వెళ్తోందని ఆమె మేనేజర్ స్పష్టం చేసిన కూడా ఈ రూమర్లు తగ్గలేదు. అయితే ఈ రూమర్లకు స్వస్తి పలికేందుకు విద్యా రంగంలోకి దిగింది. "ఇప్పట్లో తల్లిని కావాలని అనుకోవడంలేదు. ప్రస్తుతం సినీ కెరీర్ కే అధిక ప్రాధాన్యమిస్తున్నాను. కానీ ఎదో ఒకరోజు మీకు గుడ్ న్యూస్ చెబుతాను" అని తెలిపింది.