English | Telugu
మహేష్ ఆగడు పాటల వివరాలు
Updated : Feb 16, 2014
"దూకుడు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న "ఆగడు" చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. ఈనెల 18 వరకు ఇక్కడే షూటింగ్ జరుపుకొని, 23 నుంచి బళ్ళారిలో తెరకెక్కించనున్నారు. ఇందులో మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న పాటలను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.