English | Telugu
టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు!
Updated : Jan 7, 2026
సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ది రాజా సాబ్(The Raja Saab), మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu) సినిమాలకు తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఉంటుందా లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. ఈ విషయంపై ఈ రెండు చిత్రాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారికి హైకోర్టులో ఊరట లభించింది.
టికెట్ రేట్ల పెంపుని రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల అనుమతి కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, దానిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరుతూ పిటిషన్లు వేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన తీర్పును పుష్ప2, గేమ్ ఛేంజర్, ఓజీ, అఖండ 2 సినిమాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లభించింది.
ది రాజా సాబ్ జనవరి 9న విడుదలవుతుండగా, మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న విడుదలవుతోంది. హైకోర్టులో ఊరట లభించడంతో ఈ రోజు రాత్రికి రాజా సాబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి.