English | Telugu
ఖాదర్ భాయ్ దర్శకత్వంలో వెన్నెల-2
Updated : Jun 30, 2011
ఖాదర్ భాయ్ దర్శకత్వంలో వెన్నెల-2 ప్రారంభమవుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం. వివరాల్లోకి వెళితే "వెన్నెల" సినిమాకి దర్శకత్వం వహించిన దేవ కట్టా ఆ తర్వాత "ప్రస్థానం" అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటించబోయే "అటోనగర్ సూర్య" అనే సినిమాకి దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ "వెన్నెల" సినిమాతోనే కిశోర్ అనే నటుడు వెన్నెల కిశోర్ గా సినీ రంగంలో హాస్యనటుడిగా కొనసాగుతున్నాడు.
నటి పార్వతీ మెల్టన్ కూడా "వెన్నెల" సినిమాతోనే తెలుగు సినీ రంగంలోకి ప్రవేశం చేసింది. ఇలా ఈ "వెన్నెల" సినిమాకి ఇంత చరిత్ర ఉంది. మరి ఆ సినిమాకి సీక్వెల్ గా "వెన్నెల-2" సినిమాని తీయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ "వెన్నెల-2" సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. దర్శకుడిగా ఎవరినీ అనుకోక పోయినా ఖాదర్ భాయ్ అనే అతను ఈ "వెన్నెల-2" సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.