English | Telugu

అన్నపూర్ణవారి ఫిల్మ్ మీడియా స్కూల్

అన్నపూర్ణవారి ఫిల్మ్ మీడియా స్కూల్ ప్రారంభమయ్యింది. వివరాల్లోకి వెళితే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో అనుభవం లేక, మంచీ చెడూ వివరం చెప్పేవారు లేక తానెంతగా ఇబ్బందులు పడ్డారో నటసామ్రాట్, పద్మవిభూషణ్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి బాగా తెలుసు. ఈ ఇబ్బందులు ఇంకెవరూ పడకుండా ఏదైనా చేయాలన్న ఆలోచనలోంచి పుట్టిందే ఈ అన్నపూర్ణవారి ఫిల్మ్ మీడియా స్కూల్. ఈ అన్నపూర్ణవారి ఫిల్మ్ మీడియా స్కూల్ లో సినీ పరిశ్రమకు సంబంధించి 24 క్రాఫ్టుల్లోనూ శిక్షణనిస్తారు.

ఈ కోర్సులు ఒక నెలరోజుల్లో ప్రారంభమవనున్నాయి. అన్నపూర్ణవారి ఫిల్మ్ మీడియా స్కూల్ ప్రతిఫలాపేక్ష లేకుండా సేవే ధ్యేయంగా సాగే శిక్షణాలయం. త్వరలో ఈ అన్నపూర్ణవారి ఫిల్మ్ మీడియా స్కూల్ లో డిగ్రీ కోర్సుని కూడా ప్రవేశపెడతారట. సినీపరిశ్రమలోని అనుభవజ్ఞులైన ప్రముఖులందరూ ఈ అన్నపూర్ణవారి ఫిల్మ్ మీడియా స్కూల్ లోని విద్యార్థినీ, విద్యార్థులకు తమ అనుభవాలను తెలియజేస్తారట.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.