English | Telugu
'వారసుడు' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
Updated : Feb 17, 2023
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'వారిసు'. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదలైంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకొని ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి 'వారిసు' స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఈ చిత్ర తెలుగు వెర్షన్ కి అంతగా రెస్పాన్స్ రాలేదు కానీ, తమిళ్ వెర్షన్ కి మాత్రం అంచనాలకు మించిన రెస్పాన్స్ వచ్చింది. మరి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
రష్మికా మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శరత్ కుమార్, సత్యరాజ్, ప్రభు, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, యోగిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.