English | Telugu
'విష్ణుకథ' మీదే కుర్ర హీరో ఆశలు.. హిట్ కొడతాడా?
Updated : Feb 17, 2023
'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాలతో ఆకట్టుకొని ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. కానీ మూడో సినిమా నుంచి తడబడ్డాడు. గతేడాది మూడు సినిమాలతో పలకరించగా అందులో 'సమ్మతమే' పరవాలేదు అనిపించుకోగా.. 'సెబాస్టియన్ పి.సి.524', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మాత్రం దారుణంగా నిరాశపరిచాయి. దీంతో ఈ ఏడాది కిరణ్ కి కీలకం కానుంది.
గతేడాది లాగే ఈ ఏడాది కూడా 'వినరో భాగ్యము విష్ణుకథ', 'మీటర్', 'రూల్స్ రంజన్' ఇలా మూడు సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు కిరణ్. అందులో 'వినరో భాగ్యము విష్ణుకథ' రేపే(ఫిబ్రవరి 18న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు మురళీ కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అల్లు అరవింద్, బన్నీవాసు ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా విజయం కిరణ్ కి చాలా కీలకం. ఈ సినిమా పరాజయం పాలైతే యువ హీరోల రేసులో కిరణ్ వెనకడిపోతాడు. తన తదుపరి చిత్రాలపైన కూడా ఈ చిత్ర ఫలితం ప్రభావం చూపుతుంది. మరి ఈ చిత్రంతో విజయం సాధించి కిరణ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.