English | Telugu
బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న యంగ్ హీరో!
Updated : Jul 24, 2023
సినీ పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలు ముందుగా ఒక హీరో దగ్గరికి వెళ్లి, ఏవో కారణాల వల్ల ఆ హీరో చేయకపోవడంతో ఆ హిట్ మరో హీరోని వరిస్తుంది. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'సామజవరగమన' విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు.
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సామజవరగమన'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్ కి ఎంతో బూస్ట్ ఇచ్చింది. అయితే ఈ కథ ముందుగా వేరే హీరో దగ్గరకు వెళ్లిందట. ఆ హీరో కాదనడంతో ఈ అవకాశం శ్రీవిష్ణు ని వరించిందట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.
సందీప్ కిషన్ నిర్మించిన 'వివాహ భోజనంబు' సినిమాతోనే రామ్ అబ్బరాజు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇందులో సందీప్ కిషన్ ప్రత్యేక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంది. సందీప్ కిషన్ తో ఉన్న పరిచయంతో రామ్ ముందుగా 'సామజవరగమన' కథని అతనికే వినిపించాడట. అప్పుడు 'మైఖేల్' ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సందీప్, తాను చేయలేనని చెప్పడంతో ఈ కథ శ్రీవిష్ణు దగ్గరకు వెళ్లిందట. అలా సందీప్ మిస్ చేసుకున్న కథతో శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.