English | Telugu

రీతూవర్మపై వస్తున్న రూమర్స్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టిన వైష్ణవ్‌ తేజ్‌!

ఈమధ్య సెలబ్రిటీల కదలికలపై నెటిజన్లు ఎక్కువ నిఘా పెట్టినట్టున్నారు. వారికి సంబంధించి ఏ ఫోటో వచ్చినా, ఏ వీడియో రిలీజ్‌ అయినా వాటిని అంగుళం అంగుళం పరీక్షించి అందులో నుంచి ఏదో ఒక రూమర్‌ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే హీరోయిన్‌ రీతూవర్మ విషయంలో జరిగింది.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందు జరిగిన వెడ్డింగ్‌ పార్టీలోనూ, పెళ్లి తర్వాత జరిగిన రిసెప్షన్‌లోనూ టాలీవుడ్‌కు చెందిన రీతూవర్మ బాగా హైలెట్‌ అయింది. దీంతో ఆమె మెగా ఫ్యామిలీలోని ఓ హీరోతో రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్‌ మొదలయ్యాయి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఉన్న బ్యాచ్‌లర్‌ హీరోలు సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌. వీరిలో ఒకరితో రీతూవర్మ రిలేషన్‌లో ఉందంటూ వస్తున్న వార్తలపై తాజాగా వైష్ణవ్‌ తేజ్‌ క్లారిటీ ఇచ్చారు.

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. ఈ సినిమా నవంబర్‌ 24న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో వైష్ణవ్‌ తేజ్‌ పాల్గొంటున్నాడు. రీతూవర్మ గురించిన రూమర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో వైష్ణవ్‌ స్పందించాడు. తమ ఫ్యామిలీలోని ఎవ్వరికీ రీతూ వర్మతో అలాంటి రిలేషన్స్‌ లేవు అని క్లారిటీ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా దీనిపై వస్తున్న రూమర్స్‌కు వైష్ణవ్‌ ఇచ్చిన క్లారిటీతో ఫుల్‌స్టాప్‌ పడిరది.