English | Telugu

‘వధువు’ వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్ : వధువు
నటీనటులు: అవిక గోర్, నందు, అలీ రెజా,
ఎడిటర్ : అనిల్ కుమార్ పి
మ్యూజిక్: శ్రీనివాస్ మద్దూరి
సినిమాటోగ్రఫీ: రామ్ కె మహేశ్
నిర్మాతలు : శ్రీకాంత్ మోహ్త, మహేంద్ర సోని
రచన, దర్శకత్వం: పోలూరు కృష్ణ
ఓటిటి : డిస్నీ ప్లస్ హాట్ స్టార్


బుల్లితెరపై చిన్నారి పెళ్ళి కూతురు సీరీయల్ తో ఫేమస్ అయిన అవిక గోర్.. వెండితెరపై ఉయ్యాల జంపాల మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన అవికగోర్.. ప్రస్తుతం ' వధువు' అనే వెబ్ సిరీస్ లో నటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తాజాగా విడుదలైన ఈ సిరీస్ మెప్పించిందా లేదా ఒకసారి చూసేద్దాం...

కథ:

ఇందు వెడ్స్ సంజయ్ అనే పెళ్ళి హడావుడిలో ఓ కుటుంబం ఉంటుంది. కాసేపటికి ఈ పెళ్ళి జరగదని పెళ్ళికూతురి తండ్రికి వాళ్ళ తమ్ముడు వచ్చి చెప్తాడు. అసలేం జరిగిందని ఆలోచించేలోపే.. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పెళ్ళి పనులు జరుగుతుంటాయి. కానీ ఈ సారీ పెళ్ళి ఇందు వెడ్స్ ఆనంద్. అయితే ఈ పెళ్లికి రెండు, మూడు అడ్డంకులు వచ్చినా ఆనంద్ తమ్ముడు ఆర్య దగ్గరుండి పెళ్ళి జరిపిస్తాడు. ఆ తర్వాత వధువు అత్తగారింట్లోకి రాగానే.. ఈ ఇంట్లోకి రావొద్దు వెళ్ళిపో అనే సౌండ్ వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే ఒక పిచ్చిది. ఆ తర్వాత తమ సంప్రదాయం ప్రకారం ఇంట్లోకి వచ్చేముందు రంగునీళ్ళలో కాళ్ళు పెట్టి రావాలని ఆ అత్త అనగా.. తన కాలికి గాయమైందని అలా రావడం కుదరదని వెనుకాలే ఉన్న ఆర్య అంటాడు. పర్లేదు నేను వస్తా అని వధువు తన కాలికి ఉన్న కట్టు తీసేసి అడుగువేయగానే భగ్గుమంటుంది. ఆ తర్వాత ఆ రంగునీళ్ళని పరీక్షించిన వధువు ఇందుకి అందులో ఎవరో కారం కలిపారని తెలుస్తుంది. కొన్నిరోజులకి తనకి ఒక బాక్స్ లో గుండు సూది బహుమతిగా వస్తుంది. అది పంపిందెవరో అడ్రసు ఉండదు. అసలు వధువు ఇందు పెళ్లికి ఈ కథకి సంబంధమేంటి? ఆర్య ఎందుకు అలా చేస్తాడు? అసలు వధువు అత్తాగారింట్లోకి వెళ్ళాక ఎలాంటి సమస్యల్లో చిక్కుకుందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే...

విశ్లేషణ:

వధువు ఇందు(అవికగోర్) పెళ్లి ఆగిపోవడంతో కథని ఎత్తుకున్న తీరు బాగుంది. ఆ తర్వాత తన పెళ్ళి ఆగిపోవడానికి చెల్లెలు భాను కారణమని తర్వాత రివీల్ అయ్యే సీన్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ మొదటి ఎపిసోడ్ లో‌ భాగంగా.. ఇందు పెళ్ళికి వచ్చిన కూరగాయలు, పండ్లలో ఒక దాంట్లో సూది రావడం మరీ వింతగా అనిపిస్తుంది. ఆ పండులో ఒక ఆకు(ది లీఫ్) ఉంటుంది. ఆ ఆకు ఏంటో తెలుసుకుందామని వధువు ఇందు వాళ్ళ బామ్మని అడిగితే అది ఉమ్మెత్త ఆకు అని అది చాలా డేంజర్ అని చెప్తుంది. దీంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.

తన పెళ్ళిని ఎవరో ఆపాలని ట్రై చేస్తున్నారని ఇందు గ్రహిస్తుంది. ఇక ఎలాగోలా పెళ్ళి జరిగి అత్తింటికి వెళ్ళిన ఇందుకి మొదటి రోజు నుండి సమస్యలు ఎదురవుతూనే ఉండటంతో.. ఇందు తన డిటెక్టివ్ మొదలెడుతుంది. ది షాడో, షెర్ లాక్ హోమ్స్ అని ఒక సీరియస్ మిస్టరీనీ చేదించే పనిలో వధువు ఇందు నిమగ్నమవుతుంది.

నాల్గవ ఎపిసోడ్ లో.. ది సీక్రెట్ అని ఉంటుంది. ఇందులో దాని వెనుక ఉన్న సీక్రెట్ గురించి ఇందు వెతకడంతో ఫుల్ ఎంగేజింగ్ సాగుతుంటుంది. ఆ తర్వాత ది బుక్ స్టోర్ ఎపిసోడ్ లో అసలు ఆ ఆకుకి సంబంధించిన ఆచూకీ కోసం వధువు ఇందు బుక్ స్టాల్ కి వెళ్తుంది. ఆ తర్వాత తనకి కొన్ని క్లూలు దొరుకుతాయి. వాటితో తనో కన్ఫెషన్ కు వచ్చిందని అనుకుంటున్న తరుణంలో మరో ట్విస్ట్ ఉంటుంది.

ఊహించని మలుపులతో సాగుతుంది ఈ వెబ్ సిరీస్. కథలో కొత్తదనంతో పాటు తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటిని ప్రేక్షకులకి కల్గించడంలో దర్శకుడు పోలూరు కృష్ణ విజయం సాధించాడు. ఇక ఈ వెబ్ సిరీస్ ఎండింగ్ లో కథ ఇప్పుడే మొదలైంది అంటూ .. అసలు దీని వెనుక ఉందెవరు అనే ఉత్కంఠని కలిగిస్తూ.. మరో భాగం ఉండబోతుందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. నిడివి కూడా ఎక్కువ లేకుండా జాగ్రత్తపడ్డాడు డైరెక్టర్. శ్రీనివాస్ మద్దూరి సంగీతం ఆకట్టుకుంది. రామ్ కె మహేశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అనిల్ కుమార్ పి ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ఆర్య పాత్రలో అలీ రాజా ఆకట్టుకున్నాడు. ఆనంద్ పాత్రలో నందు ఒదిగిపోయాడు. ఇక వధువు ఇందు పాత్రలో అవిక గోర్ వెబ్ సిరీస్ కి ప్రాణం పోసింది. ఇక మిగిలిన వాళ్లు వారి పాత్రలకి న్యాయం చేశారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్ :

ఊహకందని ట్విస్ట్ లతో సాగే ఈ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్.. ఒక మెచుర్డ్ వధువుని పరిచయం చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 2.75 / 5

✍🏻. దాసరి మల్లేశ్

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.