English | Telugu
చంద్రముఖిలో ఆమెలా నటించడం అసాధ్యం అంటున్న కంగన
Updated : Feb 12, 2023
మలయాళంలో మోహన్‌లాల్, శోభన నటించిన సినిమా మణిచిత్రతాళ్. ఈ సినిమా అక్కడ చాలా పెద్ద హిట్ కావడంతో తమిళంలో పి.వాసు చంద్రముఖి పేరుతో తెరకెక్కించారు. 2005లో విడుదలైంది ఈ చిత్రం. రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు, వినీత్, వడివేలు, షీలా, నాజర్,కె.ఆర్.విజయ, మాళవిక కీ రోల్స్ చేశారు. పాటలు కూడా సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లోనే చంద్రముఖి వసూళ్లు 75 కోట్లు దాటాయని చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. లారెన్స్ కీ రోల్ చేస్తున్నారు. చంద్రముఖి కేరక్టర్‌లో కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ సినిమా గురించి కంగన రనౌత్ మాట్లాడారు. ``17 ఏళ్లయినా ఈ చిత్రాన్ని జనాలు మర్చిపోలేదు. ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రెడీ అవుతోంది. నేను ఆ చిత్రాన్ని ప్రతిరోజూ చూస్తున్నాను. జ్యోతిక నటనను సూక్ష్మంగా పరిశీలిస్తున్నాను. ఆమె నటన నాలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఐకానిక్ పెర్ఫార్మెన్స్ చేశారు.
ఇప్పుడు మేం క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం. చాలా సార్లు నెర్వస్‌గా అనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో జ్యోతిక పెర్ఫార్మెన్స్ కేక. ఆమె నటనను మ్యాచ్ చేయడం లిటరల్‌గా నా వల్ల కాదు. నటిగా బ్రిలియెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు జ్యోతిక`` అని అన్నారు కంగనా రనౌత్. గతంలో ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ నార్త్ లో తనకు నచ్చిన నటీమణులు చాలా మంది ఉన్నారని అన్నారు. వాళ్లల్లో కంగనా రనౌత్ అంటే ఇష్టమని తెలిపారు. ``నార్త్ సినిమాలతో పోలిస్తే, సౌత్ వారికి డిసిప్లిన్ ఎక్కువ. ఇక్కడి సినిమాలు ఇంటర్నేషనల్ లెవల్లో జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. జనాలు డౌన్ టు ఎర్త్ ఉంటారు`` అంటూ సౌత్‌ని పొగిడిన నార్త్ సెలబ్రిటీల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు కంగనా రనౌత్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితం ఆధారంగా కంగన రనౌత్ తలైవి సినిమాలో నటించారు.