English | Telugu

డిసెంబర్ లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆగస్టు 25న 'గాండీవధారి అర్జున' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ సినిమా విడుదలైన మూడు నెలలకే ఆయన మరో సినిమాతో అలరించనున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లో 13వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు-హిందీ భాషల్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ తాజాగా ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకుందని, డిసెంబర్‌లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.

#VT13 టీమ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షెడ్యూల్ పూర్తయిన విషయాన్ని తెలుపుతూ మేకర్స్ రివిల్ చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న ఐఏఎఫ్ అధికారిగా కనిపిస్తున్నారు.

ఈ యాక్షన్ డ్రామా టైటిల్‌ను త్వరలో అనౌన్స్ చేస్తారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ ఈ చిత్రంలో రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామా 'ఓజీ'ని కూడా డిసెంబర్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి డిసెంబర్ లో బాబాయ్, అబ్బాయ్ ల బాక్సాఫీస్ పోరు ఉంటుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.