English | Telugu

లియో ఫ‌స్ట్ హాఫ్‌... హాట్ అప్‌డేట్స్ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌!

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన సినిమా లియో. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను సెవ‌న్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తోంది. అక్టోబ‌ర్ 19న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది లియో. సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఫ్యాన్స్ కి మెల్లిమెల్లిగా అప్‌డేట్స్ అందుతున్నాయి. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చేశారు నిర్మాత ల‌లిత్‌కుమార్‌. ఆయ‌న లియో ఫ‌స్ట్ హాఫ్ చూసేశార‌ట‌. ఆనందాన్ని ఆపుకోలేక ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. ఇటీవ‌ల విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్న మ‌హారాజా సినిమా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చెన్నైలో జ‌రిగింది. ఈ వేదిక‌మీదే ల‌లిత్‌కుమార్ అప్‌డేట్స్ రివీల్ చేశారు.

ల‌లిత్‌కుమార్ మాట్లాడుతూ ``నేను లియో ఫ‌స్ట్ హాఫ్ చూశాను. ఫెనోమిన‌ల్‌గా ఉంది. ఎడిట‌ర్ ఫిలోమిన్ రాజా అద్భుతంగా క‌ట్ చేశారు. ఆయ‌న ప‌ని చూసి నేను ఫిదా అయ్యాను. నేను ఎడిట‌ర్‌కి ఎప్పుడూ ఫ్యాన్ కాలేదు. ఫ‌స్ట్ టైమ్ లియో ఎడిట‌ర్‌కి ఫ్యాన్ అయిపోయాను. నేను ఫ‌స్ట్ హాఫ్ సినిమా చూడ‌గానే ముందు లోకేష్ క‌న‌గ‌రాజ్‌కి ఫోన్ చేశాను. అద్భుత‌మైన ఎడిటింగ్‌. ఎంతో గొప్ప‌గా చేశారు. చాలా బావుంది అని చెప్పాను. లోకేష్ నేను చెప్పిందంతా విని, `నేను ఈ సినిమాకు డైర‌క్ట‌ర్‌ని సార్‌` అని అన్నారు. నాకు చాలా సంబ‌రంగా అనిపించింది. ఆ త‌ర్వాత ఎడిట‌ర్‌తో మాట్లాడాను`` అని అన్నారు. త్రిష కృష్ణ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, మిస్కిన్‌, అనురాగ్ క‌శ్య‌ప్‌తో పాటు ప‌లువురు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా లియో. లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్శ్‌లో ఉంటుంది. ఖైదీ, విక్ర‌మ్ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్శ్‌లో తెర‌కెక్కిన సినిమాలే. లియోలో సూర్య గెస్ట్ రోల్ చేశార‌నే మాట వైర‌ల్ అవుతోంది. దీంతో పాటు ఫాహ‌ద్ ఫాజిల్ కూడా క‌నిపిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రెండు కేర‌క్ట‌ర్ల‌నూ క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన విక్ర‌మ్‌లో చూపించారు డైర‌క్ట‌ర్ లోకేష్‌.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.