English | Telugu

ఇక దసరా సరదా తీరిపోతుంది.. ఓటీటీలో 29 సినిమాలు రెడీ!

థియేటర్లలో ప్రతి వారం సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. ఇక పండగ వచ్చిందంటే సినిమా రిలీజ్‌లు కూడా ఎక్కువ ఉంటాయి. అందులోనూ పెద్ద సినిమాలు రిలీజ్‌ ఉండడంతో తమ అభిమాన హీరో సినిమాలను థియేటర్స్‌లో చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. ఈ వేదికపై తరచూ సినిమాలు రిలీజ్‌ అవుతూనే ఉంటాయి. వివిధ ఓటీటీ సంస్థలు అన్ని భాషల సినిమాలను రిలీజ్‌ చేస్తూ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు అందరూ దసరా సెలవుల్లో ఉన్నారు. కాబట్టి సినిమాలు చూసే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఓటీటీ సంస్థలు కూడా కొత్త కొత్త సినిమాలను రిలీజ్‌ చేస్తున్నాయి. దసరా సెలవులు స్టార్ట్‌ అయిన తర్వాత కొన్ని సినిమాలు ఆల్రెడీ స్ట్రీమ్‌ అవుతున్నాయి. మరికొన్ని 20, 21, 22 తేదీల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యాయి అంటే దసరా ఎఫెక్ట్‌ ఎంతలా ఉందో చూడండి. టోటల్‌గా ఈ వారం 29 కొత్త సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి.మరి ఆ సినిమాల వివరాలు ఏమిటో చూద్దాం.

అమెజాన్‌ ప్రైమ్‌ :
మామా మశ్చీంద్ర (తెలుగు), సయెన్‌ : డిసర్ట్‌ రోడ్‌ (ఇంగ్లీష్‌), ద అదర్‌ జోయ్‌ (ఇంగ్లీష్‌), ట్రాన్స్‌ఫార్మర్స్‌: ద రైజ్‌ ఆఫ్‌ ద బీస్ట్స్‌ (ఇంగ్లీష్‌), అప్‌లోడ్‌ సీజన్‌ 3 (ఇంగ్లీష్‌ సిరీస్‌), క్యాంపస్‌ బీస్ట్‌ సీజన్‌ 2 (హిందీ సిరీస్‌),
డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ :
కింగ్‌ ఆఫ్‌ కొత్త (హిందీ)
నెట్‌ ఫ్లిక్స్‌ :
క్రియేచర్‌ (టర్కిష్‌ సిరీస్‌), డూనా (కొరియన్‌ సిరీస్‌), ఎలైట్‌ సీజన్‌ 7 (స్పానిష్‌ సిరీస్‌),
కండాసమ్స్‌ :
ది బేబీ (ఇంగ్లీష్‌), ఓల్డ్‌ డాడ్స్‌ (ఇంగ్లీష్‌), సర్వైవింగ్‌ ప్యారడైజ్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌), పెయిన్‌ హజ్లర్స్‌ (ఇంగ్లీష్‌),
జెరాన్‌ టోమిక్‌ :
లా హోమీ అరైనీ దే పారిస్‌ (ఫ్రెంచ్‌), క్యాస్ట్‌ అవే దివా (కొరియన్‌ సిరీస్‌), బాడీస్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌)
కెప్టెన్‌ లేజర్‌ హాక్‌ :
ఏ బ్లడ్‌ డ్రాగన్‌ రీమిక్స్‌ (ఇంగ్లీష్‌ సిరీస్‌), క్రిప్టో బాయ్‌ (డచ్‌ మూవీ), నియాన్‌ (ఇంగ్లీష్‌),
సోనీ లివ్‌ : హామీ 2 (బెంగాలీ)
బుక్‌ మై షో :
మై లవ్‌ పప్పీ (కొరియన్‌), ది నన్‌ (ఇంగ్లీష్‌)
ఆహా : సర్వం శక్తిమయం (తెలుగు), రెడ్‌ శాండల్‌వుడ్‌ (తమిళం), మామా మశ్చీంద్ర (తెలుగు)
ఈ విన్‌ :
కృష్ణారామా (తెలుగు)
లయన్స్‌ గేట్‌ ప్లే :
మ్యూగీ మూరే (ఇంగ్లీష్‌)
ఆపిల్‌ ప్లస్‌ టీవీ :
ది పిజియన్‌ టన్నెల్‌ (ఇంగ్లీష్‌)

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .