English | Telugu

అది విని నా గుండె పగిలిపోయింది.. మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు!

ఏ విషయం గురించైనా స్పందించడం, తన అభిప్రాయం తెలియజేయడం మంచు లక్ష్మీకి మొదటి నుంచీ అలవాటే. అది రాజకీయమైనా, సినిమా అయినా స్పందన మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు ఓ కొత్త అంశంపై తన గుండె పగిపోయిందంటూ స్పందించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతలా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే... ఇటీవల స్వలింగ వివాహాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. సేమ్‌ సెక్స్‌ వివాహాలు విదేశాలలో చాలా సర్వసాధారణం. కానీ, మన దేశంలో అలాంటి స్వతంత్రం లేదు. దీని గురించి జరిగిన అనేక చర్చల తర్వాత సుప్రీమ్‌ ఓ సంచలన తీర్పును వెలువరించింది. స్వలింగ వివాహాలను ఆమోదించలేమని కోర్టు స్పష్టం చేసింది. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా దాన్ని పార్లమెంటుకే వదిలేస్తున్నామని, ఈ విషయంలో తుది నిర్ణయం వారిదేనని చెప్పింది.

సుప్రీమ్‌ కోర్టు తీర్పును ఎంతో మంది ఖండిరచారు. కొందరు బాలీవుడ్‌ హీరోయిన్లు బాహాటంగానే తన నిరసనను వ్యక్తం చేశారు. ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఇవ్వాలని వారు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే... టాలీవుడ్‌ నుంచి మంచు లక్ష్మీ ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీమ్‌ కోర్టు తీర్పు విని తన గుండె పగిలిపోయిందని చెప్పింది. స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించలేమని సుప్రీమ్‌ కోర్టు చెప్పడంతో తానెంతో నిరాశకు లోనయ్యానని అంటోంది. ప్రేమ అనే అనుభూతిని ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన భారతదేశానికి ఈ తీర్పు నిజంగా అవమానం అంటోంది. ఎన్నో దేశాల్లో స్వలింగ వివాహాలు చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు. మన దేశంలో కూడా ఈ వివాహాలను చట్టబద్దం చేయలేమా అని ప్రశ్నిస్తోంది మంచు లక్ష్మీ.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.