English | Telugu

మొన్న 'జనతా గ్యారేజ్'.. నిన్న 'రంగస్థలం'.. నేడు 'ఉప్పెన', 'పుష్ప'..!!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు అవార్డులు ఒకే సంస్థ నిర్మించిన వేర్వేరు చిత్రాలకుగానూ ఒకే ఏడాది రావడం అరుదనే చెప్పాలి. అయితే, హ్యాట్రిక్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని సుసాధ్యం చేసింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) విభాగంలో 'ఉప్పెన'కి గానూ ఒక పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకున్న మైత్రీ.. ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్) విభాగాల్లో 'పుష్ప - ది రైజ్'కి గానూ మరో రెండు అవార్డ్స్ క్రెడిట్ చేసుకుంది. మొత్తంగా.. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మైత్రీకి 'త్రీ' అవార్డ్స్ దక్కాయి.

అయితే, మైత్రీ సంస్థకి నేషనల్ అవార్డ్స్ రావడంఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనూ జాతీయ పురస్కారాలు దక్కాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండో చిత్రం 'జనతా గ్యారేజ్'కి గానూ స్పెషల్ జ్యూరీ కేటగిరిలో మోహన్ లాల్ కి, ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో రాజు సుందరం (ప్రణామం సాంగ్)కి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అదేవిధంగా.. తమ సంస్థ మూడో సినిమా 'రంగస్థలం'కిగానూ బెస్ట్ ఆడియోగ్రాఫర్ కేటగిరిలో ఎం.ఆర్. రాజకృష్ణన్ జాతీయ పురస్కారం సొంతం చేసుకున్నారు. మరి.. మున్ముందు కూడా మైత్రీ వారి సినిమాలు నేషనల్ అవార్డ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయేమోచూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.