English | Telugu
‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Nov 21, 2023
వెబ్ సిరీస్ : ది రైల్వే మెన్
నటీనటులు: కేకే మీనన్, మాధవన్, దివ్యేందు, బాబిల్ ఖాన్, సున్నీ హిందూజా, దివ్యేందు భట్టాచార్య, జుహీఛావ్లా, మందిరాబేడీ తదితరులు
ఎడిటింగ్: యశ్ జయదేవ్
సినిమాటోగ్రఫీ: రూబైస్
సంగీతం: సామ్ స్లాటర్
దర్శకత్వం: శివ్ రావైల్
నిర్మాతలు: యశ్ రాజ్ ఫిల్మ్స్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి కోవలో వచ్చిన ' ది గ్రేట్ ఇండియన్ మర్డర్' మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అలాంటి కోవలోకి వచ్చిన సిరీస్ ' ది రైల్వేమెన్'.. కేకే మీనన్, మాధవన్, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కథేంటో ఒకసారి చూసేద్దాం...
కథ:
భోపాల్ లో యూనియన్ కార్బైట్ ఫ్యాక్టరీనీ ఓ విదేశీ కంపెనీ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే భోపాల్ రైల్వేస్టేషన్ లో ఇఫ్తికార్ సిద్దిఖీ(కేకే మీనన్) స్టేషన్ మాస్టర్ గా పని చేస్తుంటాడు. సిద్దిఖీ అంటే అక్కడ పనిచేసేవాళ్ళందరికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎవరేం సహాయం అడిగిన చేస్తుంటాడు.యూనియన్ కార్బైట్ కంపెనీ యాజమాన్యం కనీస భద్రత తీసుకోవకుండా నడిపిస్తుంటారు. అయితే ఈ విషయమై అక్కడ పనిచేసే సీనియర్ వర్కర్లు కంప్లైంట్ చేసిన పై అధికారులు పట్టించుకోరు. అయితే ఈ కంపెనీకి పక్కనే ఉన్న బస్తీలో ఇమద్(బాబిల్ ఖాన్) నివసిస్తుంటాడు. రిపోర్టర్(సన్నీ హిందూజ) కి కార్బైట్ కంపెనీలో ఉన్న లోపాలని ఇమద్ చెప్తాడు. అయితే ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి కార్బైట్ కంపెనీ నుండి గ్యాస్ లీక్ అవుతుంది. ఇది భోఫాల్ మొత్తం వ్యాపిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉండే ప్రజల పరిస్థితి ఏంటి? విష వాయువుకి సామాన్యులు ఎలా బలైపోయారు? భోపాల్ గ్యాస్ లీక్ ఘటన తెలిసిన సెంట్రల్ రైల్వేస్ జీఎం రతి పాండే(మాధవన్) ఏం చేశారో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే...
విశ్లేషణ:
1984 డిసెంబర్ లో చోటుచేసుకున్న భోపాల్ గ్యాస్ లీక్ లో దాదాపు 15 వేల మంది చనిపోయారు. ఈ వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిందే ఈ ' ది రైల్వే మెన్'. వాస్తవ సంఘటనలని, ఆ కాలంలోని మౌలిక వసతులని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ హృదయాలని హత్తుకునేలా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ శివ్ రావైల్ సక్సెస్ అయ్యాడు.
ఈ వెబ్ సిరీస్ మొదటి పార్ట్ లో .. మన దేశంలో అప్పుడు పరిస్తితులు ఎలా ఉండేవో వివరించాడు. దీనికి కాస్త టైమ్ తీసుకున్నాడు డైరెక్టర్ శివ్ రాజైల్. కార్బైట్ కంపెనీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనం నిల్వ ఉందని అందులో ఒకప్పుడు పనిచేసిన ఇమద్ ద్వారా తెలియజేసాడు. అయితే అతని స్నేహితుడి పోస్ట్ మార్టం అత్యంత భయానకంగా చూపించడంతో సెన్సిటివ్ మనస్సు గలవారు కాస్త స్కిప్ చేస్తే బెటర్. అయితే ఈ సంఘటన ద్వారా అక్కడ ఎంత విషవాయువు ఉందో ప్రేక్షకులకు అర్థమమయ్యేలా చేసిన తీరు బాగుంది. స్టేషన్ మాస్టర్ ఇఫ్తికార్ అక్కడి స్టేషన్ ని పర్యవేక్షించడానికి ముందే రావడం, అదే సమయంలో అక్కడ పని చేసే ఓ మహిళ కుమార్తె వివాహం జరుగుతుంటుంది. భోపాల్ రైల్వేస్టేషన్ లోని కొన్నింటిని దొంగతనం చేయడానికి వచ్చిన విలేఖరి(దివ్యేందు శర్మ).. కార్బైట్ కంపెనీలో ఉన్న లోపాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి ప్రతీ ఒక్క పాత్రని వివరించిన తీరు బాగుంది.
కార్బైట్ కంపెనీ నుండి గ్యాస్ లీక్ అయిన తర్వాత అక్కడి జనాల పరిస్తితి మరింత విషమంగా ఉంటుంది. ఆ ప్రదేశం నుండి ఎంతమంది ప్రాణాలతో బయటపడతారో అనే ఉత్కంఠ ప్రేక్షకులలో మొదలవుతుంది. అదే సమయంలో గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్ ఆ ప్రదేశానికి వస్తుండటం, అక్కడ రైల్వే అధికారులు ఇఫ్తికార్ సిద్దిఖి దానిని ఆపేందుకు పడే పాట్లు, ఇమద్ వారిని కాపడటానికి చేసే సాహసం అంతా కూడా ప్రేక్షకులకు ఫుల్ ఎంగేజింగ్ కలిగిస్తాయి. భోపాల్ నుండి వెళ్ళే రైలు మరియి భోపాల్ కి వచ్చే గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్ రెండూ ఢీకొంటాయా లేదా అన్న ఉత్కంఠ ప్రేక్షకులకి థ్రిల్ ని ఇస్తుంది. భోపాల్ దుర్ఘటన తర్వాత అక్కడి ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూపించే సీన్స్ హృదయాలని కలిచివేస్తుంది. రూబైస్ సినిమాటోగ్రఫీ బాగుంది. సామ్ స్టాటర్ బిజిఎమ్ ఆకట్టుకుంది. యశ్ జయదేవ్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
భోపాల్ స్టేషన్ మాస్టర్ గా ఇఫ్తికార్ పాత్రలో కేకే మీనన్ జీవించేసాడు. స్టేషన్ లో దొంగతనానికి వచ్చి మనసు మార్చుకున్న వ్యక్తి పాత్రలో దివ్యేందు శర్మ ఒదిగిపోయారు. విలేఖరిగా సున్నీ హిందూజ ఆకట్టుకున్నారు. జీఎం గా మధావన్, జూహీ చావ్లా, మందిరాబేడీ ఇలా ప్రతీ ఒక్కరు తమ పాత్రకి న్యాయం చేశారు.
తెలుగు వన్ పర్ స్పెక్టివ్:
వాస్తవ సంఘటనలని తెరపై చూడాలనుకునేవారికి ఈ సిరీస్ మంచి థ్రిల్ ని ఇస్తుంది.
రేటింగ్ :3 / 5
✍🏻. దాసరి మల్లేశ్