English | Telugu

పవర్ స్టార్ కు తమ్మారెడ్డి ప్రశంసలు

పవన్ కళ్యాణ్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నాడని, రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం పలు భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే పవన్ రాజకీయ వార్తలపై ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... "పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ పెట్టడం సరైనది కాదు. ఒకవేళ ఒక 10నెలల ముందు పెట్టి ఉంటే, ఇప్పటికే మంచి సభ్యులను ఎన్నుకొని ప్రజలకు సేవ చేసే అవకాశం ఉండేది. కానీ ఇపుడంతా కూడా రాజకీయాల్లో తమకు సీట్లు దొరకకపోతే ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ చేసేవాళ్ళు, ఇప్పటి వరకు ఉన్న పార్టీలో ఉండి లంచాలు, మోసాలు చేసిన వాళ్ళు వచ్చి ఈ కొత్త పార్టీలో చేరే అవకాశం ఉంది. లేదంటే గతంలో ప్రజారాజ్యం పార్టీలో మిగిలిపోయిన వారే ఇందులో చేరే అవకాశం ఉంది. కాబట్టి.. పవన్ ఈ సమయంలో రాజకీయాలకు రాకపోవడమే మంచిది. ఎందుకంటే అతనికి ప్రజల్లో మంచి పేరుంది. ఒక క్లీన్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి. కనుక మళ్ళీ పార్టీ పెట్టి తప్పుడు నిర్ణయం తీసుకోవడం కన్నా రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిది." అని అన్నారు.