English | Telugu
శింబు త్రిష నో లవ్..ఓన్లీ యాక్షన్
Updated : Mar 10, 2014
"విన్నైతాండి వరువయ" సినిమాలో నటించి హిట్ పెయిర్ గా నిలిచిన శింబు, త్రిషలు మరోసారి జతకట్టబోతున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా కూడా మరో రొమాంటిక్ ప్రేమకథా చిత్రమని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై శింబు స్పందిస్తూ... "అందరూ అనుకుంటున్నట్లు ఇది ప్రేమకథా చిత్రం కాదు. ఇది ఒక స్టైలిష్ యాక్షన్ చిత్రం. త్రిష హీరోయిన్. ఇందులో మరో హీరోయిన్ ను సెల్వా ఎంపిక చేయనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు" అని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.