English | Telugu

Spirit: రాజమౌళి, అల్లు అర్జున్ కి షాకిచ్చిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'స్పిరిట్'(Spirit). కేవలం ప్రకటనతోనే మోస్ట్ హైప్డ్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్.

2027 సంక్రాంతి కానుకగా 'స్పిరిట్' విడుదల కానుంది అంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించడం విశేషం.

స్పిరిట్ సినిమాను 2027, మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. పాన్ ఇండియా భాషలతో పాటు, పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'వారణాసి'తో పాటు, అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'AA22'ని కూడా 2027, మార్చిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పుడదే మార్చి నెలలో స్పిరిట్ మూవీ కర్చీఫ్ వేయడం సంచలనంగా మారింది.

ఈ మూడూ ఇండియాలో రూపొందుతోన్న భారీ సినిమాలు. అలాంటిది ఈ మూడు సినిమాలు తక్కువ వ్యవధిలో విడుదలైతే.. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయం.