English | Telugu
త్రిషను వదిలేసి కొత్తది మొదలెట్టిన రాజు
Updated : Mar 10, 2014
త్రిష ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ, నిర్మిస్తున్న చిత్రం "రమ్". ఈ సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకున్న త్రిషకు నిరాశే మిగిలింది. ఈ చిత్ర షూటింగ్ గతకొంత కాలంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తిగా పక్కకిపెట్టినట్లు తెలిసింది. రాజు ప్రస్తుతం కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. "జపం" అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా విజయ్ కార్తీక్ అనే కొత్తబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి రాజు తన "రమ్" సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.