English | Telugu
లియో షూటింగ్ పూర్తి చేస్తున్న దళపతి
Updated : Jun 26, 2023
దళపతి విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా లియో. విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమా పూర్తవగానే దళపతి మరో సినిమా సెట్స్ కి ఎంట్రీ ఇస్తారు. ఆ వెంటనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో వైరల్ అవుతున్న విషయాల ప్రకారం లియో షూటింగ్ ఇంకో ఐదారు రోజులు మాత్రమే ఉంది. ఈ సినిమాలో విజయ్‌తో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవమీనన్, మన్సూర్ అలీఖాన్ నటిస్తున్నారు. చాలా చిన్న షెడ్యూల్ తప్ప షూటింగ్ పూర్తయింది.
తలకోనలోనూ, చెన్నైలోనూ ఆ షెడ్యూల్‌ని పూర్తిచేస్తారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే దళపతి విజయ్ నెక్స్ట్ సినిమా సెట్స్ కి వెళ్లారు. ఆల్రెడీ వెంకట్ ప్రభు ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి, విజయ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆగస్టులో ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 19న లియో విడుదల కానుంది. అది పూర్తయ్యేటప్పుడే, నెక్స్ట్ పొలిటికల్ ప్లాన్స్ గురించి అనౌన్స్ చేస్తారట విజయ్.