English | Telugu
షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన 'సలార్' యాక్టర్!
Updated : Jun 26, 2023
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన తదుపరి చిత్రం 'విలయత్ బుద్ధ' షూటింగ్ లో గాయపడినట్లు సమాచారం. ఆదివారం కేరళలోని ఇడుక్కిలో ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పృథ్వీరాజ్ కాలికి గాయం కావడంతో ముందుగా ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ఆయనను కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తలరించారు. ఈరోజు ఆయనకు శస్త్రచికిత్స చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే వైద్యులు పృథ్వీరాజ్ ని కనీసం రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో రెండు మూడు నెలలపాటు ఆయన సినిమాల షూటింగ్స్ వాయిదా పడనున్నాయి.
మలయాళంలో యాక్టర్ గా, డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్'లో వరదరాజ మన్నార్ అనే పవర్ ఫుల్ పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28 న విడుదల కానుంది.