English | Telugu

ఒక్కడు మళ్ళీ వస్తున్నాడు..!

తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'ఒక్కడు' సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కమర్షియల్ ఇమేజ్ తెచ్చిపెట్టి౦ది. ఇప్పుడు ఇదే సినిమాని బోణికపూర్ తన కొడుకు అర్జున్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అమిత్ శర్మ దీనికి దర్శకత్వం వహించారు. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే.. ఒక్కడులో వున్న పవర్ ని ‘తేవర్’ లో బాగానే చూపించినట్లు అనిపిస్తోంది. తెలుగులో ప్రకాశ్ రాజ్ చేసిన పాత్రను హిందీలో మనోజ్ బాజ్ పాయ్ చేసారు. ఒక్కడు లో ప్రకాష్, మహేష్ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కుదిరిందో, ‘తేవర్’ లో కూడా మనోజ్, అర్జున్ మధ్య అంతే కెమిస్ట్రీ వర్కటై౦ది. 'ఒక్కడు'లాగానే ‘తేవర్’ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.