English | Telugu
సోగ్గాడి సరసన అందాల రాక్షసి
Updated : Nov 11, 2014
‘అందాల రాక్షసి’గా టాలీవుడ్ కి పరిచయమైన లావణ్య త్రిపాటి లక్కీ చాన్స్ కొట్టేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరైన సినిమా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న లావణ్యకి కింగ్ నాగార్జున సరసన నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో కథానాయికగా లావణ్యని తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో నాగార్జున తాత, మనవడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తాత క్యారెక్టర్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, మనవడితో లావణ్య రొమాన్స్ చేయనుంది.ఈ నెల 15 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.