English | Telugu

10 నెలలు సినిమాలకు దూరం

పరిణితి చోప్రా.. ప్రియాంక చోప్రా చెల్లెలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అతి తక్కువ సమయంలోనే పాపులర్‌ అయ్యింది. వరుస సినిమాల్లో నటిస్తూ నటనతోనూ, గ్లామర్‌తోనూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 'కిల్ దిల్' సినిమా ప్రమోషన్ లో బిజీగా వున్న ఈ బాలీవుడ్ భామ ఆ సినిమా రిలీజ్ తరువాత పది నెలలు పాటు సినిమాలకు దూరంగా గడపాలని భావిస్తుందట. అలాగే ఈ సినిమాలో తన నటనను చూసి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఆసక్తిగా వున్నట్లు తెలిపింది. ప్రేక్షకుల స్పందనను బట్టి తన తరువాతి సినిమాను ఎంచుకుంటానని అంటోంది. ఈ మధ్యలో తన స్నేహితురాళ్ళతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తుందట.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.