English | Telugu

తెలుగువన్ కాంటెస్ట్: 'I Want a Virgin'కు పదివేల బాహుమతి

యువతీయువకులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఓక వేదికను ఏర్పాటు చేసి, వారి అవసరానికి కావల్సిన సదుపాయాలను సమకూర్చి, వారి ఉత్తమ ప్రతిభకు నగదు బహుమతి అందించే వేదికలను అరుదుగా చూస్తుంటాం. అలాంటి వెదికనే తెలుగువన్ ఏర్పాటు చేసింది. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దర్శకుడికి ప్రతి నెల పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తోంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న అనేక ప్రతిభ వంతులైన దర్శకులు నగదు బహుమతులతో పాటు మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకులుగా కూడా ఎదిగారు.

16 మే నుంచి 15 జూన్ వరకు తెలుగువన్ ప్రోత్సాహంతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ లో 'I Want a Virgin' అనే షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్౦గా ఎంపికయింది. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మించిన 'Jagadish Sawarkar' కి తెలుగువన్ మానేజింగ్ డైరెక్టర్ కంఠ౦నేని రవి శంకర్ గారు పదివేల రూపాయల చెక్‌ని ఇచ్చి ప్రోత్సహించారు. షార్ట్ ఫిల్మ్ రూపకర్తలకు తెలుగువన్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుని మరిన్ని ఉత్తమ షార్ట్ ఫిలింలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.