English | Telugu

అతనితోనే ‘మజాకా’?.. రియలైజ్‌ అయిన టీమ్‌!

సందీప్‌ కిషన్‌ హీరోగా రీతు వర్మ హీరోయిన్‌గా నటించిన సినిమా ‘మజాకా’. రావు రమేష్‌, మురళీశర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తిరమైన అంశం బయటికి వచ్చింది. ఇందులో సందీప్‌ కిషన్‌, రీతు వర్మలపై ‘సొమ్మసిల్లి పోతున్ననే..’ అనే పాటను చిత్రీకరించారు. ఈ పాట యూట్యూబ్‌లో చాలా ఫేమస్‌ అయిపోయింది. ఇప్పటికే 280 మిలియన్‌కి పైగా వ్యూస్‌ సాధించిన ఈ పాటను ‘మజాకా’ చిత్రం కోసం ఉపయోగించడం ఆసక్తిని రేకెత్తించింది. ఒరిజినల్‌గా ఈ పాటను రాము రాథోడ్‌ పాడాడు. ఈ పాటతోనే మీడియాలో, సోషల్‌ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘మజాకా’ చిత్రంలో ఆ పాటను రేవంత్‌తో పాడిరచారు.

ఈ పాట రిలీజ్‌ అయిన తర్వాత ఎన్నో విమర్శలు వచ్చాయి. రాము పాడిన విధానం ఎంతో బాగుందని, సినిమా కోసం పాడిన రేవంత్‌ ఆ ఫీల్‌ను తీసుకురాలేకపోయాడనే కామెంట్స్‌ వస్తున్నాయి. ఆ పాటను ఒరిజినల్‌ సింగర్‌ రాముతో పాడిస్తే బాగుంటుందని సోషల్‌ మీడియాలో సలహా ఇచ్చారు. దాన్ని పాజిటివ్‌గా తీసుకున్న మేకర్స్‌ రిలీజ్‌కి ఇంకా ఒక్కరోజు ఉందనగా ‘సొమ్మసిల్లి పోతున్ననే..’ పాటను రాము రాథోడ్‌తో పాడిరచారు. థియేటర్‌లో కూడా రాము పాడిన ట్రాకే ఉంటుందని మేకర్స్‌ స్పష్టం చేశారు. దీంతో ఆ పాటను ఎంతో ఇష్టపడే శ్రోతలు, ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .