English | Telugu

మ్యాడ్ స్క్వేర్ టీజర్ వచ్చేసింది.. మరోసారి మ్యాడ్ గ్యాంగ్ రచ్చ!

'డీజే టిల్లు'కి సీక్వెల్ గా రూపొందిన 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మరో సీక్వెల్ తో అలరించడానికి రాబోతుంది. అదే 'మ్యాడ్ స్క్వేర్'. 2023 అక్టోబర్ లో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్' రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, రెండు సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. (MAD Square Teaser)

'మ్యాడ్ స్క్వేర్' టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. 1 నిమిషం 50 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. "వెంకీ అట్లూరి 1116, అనుదీప్ కె.వి. 516, సూర్యదేవర నాగవంశీ నూట పదహారే చదివించిండు" అంటూ లడ్డు పెళ్లి చదివింపులతో టీజర్ ని ప్రారంభించిన తీరు సరదాగా ఉంది. లడ్డు పెళ్లి కోసం నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఎంటరవ్వడం.. అక్కడ నుంచి వాళ్ళు చేసే అల్లరితో టీజర్ సరదాగా సాగిపోయింది. మొత్తానికి టీజర్ చూస్తుంటే.. మ్యాడ్ గ్యాంగ్ మరోసారి థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమనిపిస్తోంది.

'మ్యాడ్ స్క్వేర్'కి కళ్యాణ్ శంకర్ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.