English | Telugu

సినీ విరాళాల తుఫాను

ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన భీభత్సం నేపథ్య౦లో బాధితులను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ నుంచి సినీ పరిశ్రమ నుంచి విరాళాల వరద కొనసాగుతోంది. టాలీవుడ్ అగ్రనటుడు బాలయ్య నుంచి చిన్న కమెడియన్‌ దాకా ప్రతి ఒక్కరూ విరాళాలతో మానవతా దృక్ఫథాన్ని చాటుటుతున్నారు. వీరితో పాటు తమిళ హీరోలు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకొనేందుకు విరాళాలతో ముందుకు వస్తున్నారు. తుపాను నుంచి ఇప్పుడిప్పుడే బాధిత ప్రజానీకం తేరుకుంటుండగా, ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి బాధిత ప్రజానీకాన్ని ఆదుకునేందుకు తమవంతు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం నుంచి విరాళాలు ప్రకటించిన సినీ ప్రముఖులు వివరాలు ఇలా వున్నాయి.

నాగార్జున : అక్కినేని ఫౌండేషన్ ద్వార 20 లక్షలు
బాలకృష్ణ : 30 లక్షలు + 15 లక్షల విలువైన 20 టన్నుల బియ్యం + మెడిసన్స్
జూనియర్ ఎన్టీఆర్ : 20లక్షలు
పవన్‌కళ్యాణ్‌ : 50 లక్షలు
రామ్ చరణ్ : 10 లక్షలు + 5 లక్షలు రామకృష్ణ మిషన్‌కి
అల్లు అర్జున్ : 20 లక్షలు
మహేష్‌బాబు : 25 లక్షలు
సూపర్‌ స్టార్‌ కృష్ణ: 15 లక్షలు
విజయనిర్మల : 10 లక్షలు
రామానాయుడు గారి ఫ్యామిలీ : 50లక్షలు
ప్రభాస్ : 20 లక్షలు
రవితేజ : 10 లక్షలు
అల్లరి నరేష్ : 5 లక్షలు
బ్రహ్మానందం : 3 లక్షలు
తెలుగు సినీ నిర్మాతల మండలి : 25 లక్షలు
సంపూర్ణేష్‌బాబు : 1లక్ష
హీరోయిన్ రకుల్ ప్రీతి: 1లక్ష
సూర్య + కార్తీ + జ్ఞాన్‌వేల్‌ రాజా: 25 లక్షలు + 15 లక్షలు + 5 లక్షలు=50లక్షలు
తానా : 45 లక్షలు
నితిన్ : 10 లక్షలు
పూరి జగన్నాథ్ కొడుకు : 2 లక్షలు
హీరో రామ్ : 10 లక్షలు
ప్రకాష్ రాజ్ : 5 లక్షలు
యంగ్ హీరో నందు : 1 లక్ష
సందీప్ కిషన్ : 2.5 లక్షలు
కాజల్ అగర్వాల్:
5 లక్షలు

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .