English | Telugu

కాజల్ 5 లక్షలు, సమంత 10 లక్షల విరాళం

హుద్‌హుద్‌ తుపాను బాధితులకు అండగా నిలిచేందుకు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఒకరి తరువాత ఒకరు ఆంధ్రప్రదేశ్‌ సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా హీరోలు తుపాను బాధితుల సహాయార్థం ప్రకటించగా, లేటెస్ట్ గా సినీ నటిలు సైతం తాము వంతు సహాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ రోజు ఉదయం ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించగా, హీరోయిన్‌ సమంత 10లక్షలు విరాళాన్ని ప్రకటించింది. సమంత పర్సనల్‌గా 5 లక్షలు, ప్రత్యూష సపోర్ట్‌ ఫౌండేషన్‌ తరఫున 5 లక్షలు మొత్తం 10 లక్షలు విరాళంగా ప్రకటించింది. మరోవైపు ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా కూడా తుపాను బాధితులకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.