English | Telugu

Anushka Shetty : టీచర్ టు స్టార్ హీరోయిన్.. జేజమ్మ బ్యూటిఫుల్ జర్నీ

ఈ జనరేషన్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఒకరు. 1981, నవంబర్ 7న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించిన అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. కుటుంబసభ్యులు ముద్దుపేరుగా పెట్టిన స్వీటీనే, అనుకోకుండా ఆమె అసలు పేరైంది. డిగ్రీ పూర్తి చేసిన స్వీటీ, మొదట స్కూల్ లో చిన్న పిల్లలకు పాఠాలు చెప్పింది. ఆ తర్వాత యోగా టీచర్ గా మారింది. అలా యోగా టీచర్ గా చేస్తున్న సమయంలోనే ఆమెకి సినిమా అవకాశం వచ్చింది.

2005లో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది స్వీటీ. ఓ స్నేహితుడు ద్వారా స్వీటీ గురించి తెలుసుకున్న పూరి.. ఆమెకు తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చాడు. మొదట్లో షూటింగ్ సమయంలో కాస్త ఇబ్బందిపడిన స్వీటీ.. కొద్దిరోజుల్లోనే తనని తాను సినిమాకి తగ్గట్టుగా మలుచుకుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే ఆమె పేరు స్వీటీ నుంచి అనుష్కగా మారింది. అలా సూపర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనుష్క. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని సాధించినప్పటికీ.. మొదటి సినిమాతోనే అనుష్క అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఏడాది ఆమె నటించిన మరో సినిమా 'మహానంది' విడుదల కాగా.. అది కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

2006లో రవితేజ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 'విక్రమార్కుడు'తో మొదటి బ్లాక్ బస్టర్ అందుకుంది అనుష్క. అక్కడి నుంచి వరుస అవకాశాలు, ఏడాదికొక ఘన విజయంతో తక్కువ సమయంలో అగ్ర కథానాయికగా ఎదిగింది. 2007 లో 'లక్ష్యం', 2008 లో 'శౌర్యం'తో మంచి విజయాలు అందుకుంది. ఇక 2009లో వచ్చిన 'అరుంధతి' చిత్రం ఒక్కసారిగా అనుష్క ఇమేజ్ ని ఎన్నో రెట్లు పెంచింది. అనుష్క డ్యూయల్ రోల్ పోషించిన ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్.. స్టార్ హీరోల సినిమాల రికార్డులను సైతం బద్దలుకొట్టి ఆమెను లేడీ సూపర్ స్టార్ ని చేసింది. జేజమ్మగా తెలుగు కుటుంబాలకు ఎంతో చేరువ చేసింది. అప్పటి నుంచి అనుష్క నేమ్ ఒక బ్రాండ్ లా మారింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా టాప్ చైర్ లో కూర్చుంది. ఓ వైపు 'మిర్చి', 'సింగం' వంటి కమర్షియల్ సక్సెస్ లు చూస్తూనే.. మరోవైపు 'వేదం', 'పంచాక్షరి', 'నాగవల్లి' లాంటి సినిమాల్లో తన నటనతో కట్టిపడేసింది. ముఖ్యంగా 'వేదం'లో సరోజ అనే వేశ్య పాత్ర అద్భుతంగా పోషించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

2014 వరకు ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు, తమిళ్ లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. 2015లో వచ్చిన 'బాహుబలి'తో దేవసేనగా పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అదే ఏడాది వచ్చిన 'రుద్రమదేవి', 'సైజ్ జీరో' సినిమాలతో తన నటనా ప్రతిభను చాటుకుంది. ఇక 2017లో వచ్చిన 'బాహుబలి-2'తో అనుష్క రేంజ్ మరోస్థాయికి వెళ్ళింది. ఆ మరుసటి ఏడాది 2018లో వచ్చిన 'భాగమతి'తో మరోసారి నట విశ్వరూపం చూపించింది. కొంతకాలంగా సినిమాలను తగ్గించిన అనుష్క.. ఇటీవల 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

18 ఏళ్ళ సినీ ప్రయాణంలో జేజమ్మగా, సరోజగా, దేవసేనగా, రుద్రమదేవిగా, భాగమతిగా ఇలా ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు చేసిన అనుష్క.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ నవంబర్ 7తో 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 43వ వసంతంలోకి అడుగుపెడుతున్న అనుష్కకు తెలుగువన్ తెలుగువన్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .