English | Telugu

సూర్యకాంతంను ఈతరం ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి!

గయ్యాళి అత్తగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న దివంగత నటి సూర్యకాంతం శతజయంతిని పురస్కరించుకుని చెన్నైలోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌లో శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'తెలుగింటి అత్తగారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్యకాంతంకు నివాళులర్పించిన ఆయన, చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభమూర్తిని అభినందించారు.

తెలుగు సినిమా ప్రపంచంలో ప్రత్యామ్నాయం లేని నటుల్లో సూర్యకాంతం మొదటి వరుసలో ఉంటారని, వారి ఆహార్యాన్ని, వాచకాన్ని అనుకరించటం కూడా కష్టమేనని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. గుండమ్మకథ లాంటి చిత్రానికి ఆమె పాత్ర పేరు పెట్టడమే వారికి సినీరంగం ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేసిందని అన్నారు. సూర్యకాంతం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిందని తెలిసి, నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత తమ అధికారిక కార్యక్రమాన్ని కూడా అర్థాంతరంగా రద్దు చేసుకుని వెళ్ళి, వారి పార్థివదేహాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉన్న సూర్యకాంతం గారి వ్యక్తిగత జీవితాన్ని ఈతరం ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆమె చేసిన గుప్తదానాలు, సొంత ఊరిని మరువకపోవటం, నలుగురి ఆకలి తీర్చటం వంటివి ఆదర్శనీయమైనవని వెంకయ్యనాయుడు తెలిపారు.

'గుండమ్మకథ'ను తర్వాత నందమూరి, అక్కినేని కుటుంబ సభ్యులు రీమేక్ చేయాలని ప్రయత్నించారు కానీ, సూర్యకాంతంకు ప్రత్యామ్నాయ నటి దొరకక డ్రాప్ అయ్యారని ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గుర్తు చేశారు. ప్రపంచంలో సూర్యకాంతం అనే పేరు ఒక్కరికే ఉందని, అలాంటి నటి ఒక్కరే ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో విజయా ప్రొడక్షన్స్ నిర్వాహకులు కె.విశ్వనాథ రెడ్డి, ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారెడ్డి, అలనాటి నటీమణులు రాజశ్రీ, జయచిత్ర, ఆర్కిటెక్స్ ఆదిశేషయ్య, సూర్యకాంతం శతజయంతి కమిటీ సభ్యులు, సూర్యకాంతం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.