English | Telugu

ఎక్స్‌పోజింగ్‌పై నోరు విప్పిన త‌మ‌న్నా

టాలీవుడ్ క‌థానాయిక‌ల నెంబ‌ర్ వ‌న్ రేసులో త‌మ‌న్నా కూడా ఉంది. స‌రైన హిట్లు ప‌డ‌కుండానే.. త‌మ‌న్నా ఇంత క్రేజ్ సంపాదించుకొందంటే.. మ‌రో రెండు విజ‌యాలు త‌న ఖాతాలోకి వెళ్తే... దుమ్మురేప‌డం ఖాయం. అందాన్ని, అభిన‌యాన్నీ మిక్స్ చేస్తూ.. కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేప‌డం ఎలాగో త‌మ‌న్నాకి బాగా తెలుసు. 100 % ల‌వ్ లో ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తూనే... అందాలారేసింది. ఇక రెబ‌ల్‌లో అయితే రెచ్చిపోయింది. కానీ.. ఎక్స్‌పోజింగ్ అనేది త‌న అభిమ‌తం కాద‌ని, నిజానికి.. ఈ వ్య‌వ‌హారాల‌కు తానెంతో దూర‌మ‌ని చెప్తోంది. కొన్ని కొన్ని సార్లు ద‌ర్శ‌కుల అభిమ‌తం ఆధారంగానే ఎక్స్‌పోజింగ్ చేస్తోంద‌ట‌. ఏ క‌థానాయిక‌కూ కేవ‌లం ఎక్స్‌పోజింగ్ ద్వారానే పేరు తెచ్చుకోవాల‌ని ఉండ‌ద‌ని, ద‌ర్శ‌కుల ఒత్తిడి మేర‌కే అలా న‌టిస్తున్నార‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది త‌మ‌న్నా. ఒక‌వేళ‌... మంచి క‌థొస్తే.. త‌ను పూర్తిగా డీగ్లామ‌ర్‌గా క‌నిపించ‌డానికైనా సిద్ధ‌మే అని ప్ర‌క‌టించింది. మ‌రి.. అలాంటి పాత్ర‌ల‌తో ఎవ‌రొస్తారో చూడాలి. ఈ కామెంట్ల‌పై మ‌న ద‌ర్శ‌కులు ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.