English | Telugu

ర‌కుల్‌... పైసా వ‌సూల్

కొ... కొ.. కో.. కోటి అంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. అవును అమ్మ‌డి పారితోషికం కోటికి చేరింద‌ట‌. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ.. రూ40 ల‌క్ష‌ల‌కు సినిమా ఒప్పుకొన్న ర‌కుల్ ఒక్క‌సారిగా.. డ‌బుల్ డోస్ పెంచేసింది. కోటి ఇస్తే.. అప్పుడు డేట్లు ఇస్తా అంటోంద‌ట‌. ర‌కుల్ పైసా వ‌సూల్ వేట‌లో ప‌డింద‌టి టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఆమె చేతిలో ప్ర‌స్తుతం మూడు సినిమాలున్నాయి. మూడూ బ‌డా హీరోల‌తోనే. వాళ్ల సినిమాల మ‌ధ్య డేట్లు అడ్జెస్ట్ చేయాలంటే కోటి ఇచ్చుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంద‌ట‌. ఈమ‌ధ్య నితిన్ సినిమా కోసం ర‌కుల్‌ని సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. ''డేట్లు ఖాళీ లేవు.. ఒక‌వేళ కోటి ఇస్తానంటే... అప్పుడు ఆలోచిస్తా..'' అంద‌ట‌. కోటి మాట వినేస‌రికి నితిన్ డ్రాప్ అయిపోయాడ‌ని టాక్‌. ర‌కుల్ డిమాండ్ ఆ రేంజులో ఉంది మ‌రి.