English | Telugu
లండన్ ఐ దగ్గర జరిగేది స్కాం గేమ్..బి అలెర్ట్ అన్న శ్యామల
Updated : Apr 27, 2023
యాంకర్ శ్యామల గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బుల్లితెర మీద చలాకీ మాటలతో ఆకట్టుకుంటూనే యాంకరింగ్ చేస్తుంది. అటు సీరియల్స్ లో ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమె లండన్ లో విహరించడానికి వెళ్ళింది. అలా లండన్ లో జరిగే విషయాలను వీడియోస్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేస్తూ ఉంది. ఐతే లండన్ లో ఏమేం ఉంటాయి అనే విషయాలు నార్మల్ పీపుల్ కి తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం శ్యామల ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటుంది. లండన్ ఐ ఏరియాలో ఉండి అక్కడే ఒక వీడియో చేసింది. అదేంటంటే ఆ లండన్ ఐ ప్లేస్ మొత్తం కూడా చాలా మంది టూరిస్టులతో నిండిపోయి కనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ కొంతమంది ఆ బ్రిడ్జి మీద ఒక మ్యాట్ వేసుకుని దాని మీద మూడు గ్లాసులు పెట్టి దాని కింద ఒక బాల్ పెట్టి గేమ్ ఆడతారు. అచ్చంగా ఎలా అంటే మన ఊళ్ళల్లో, పల్లెటూళ్లలో కాయ్ రాజా కాయ్ పేరుతో ఆడుతూ ఉంటారు కదా సేమ్ అలాగే అన్నమాట.
ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ గేమ్ ఆడేవాడు, పక్కన ఉండి ఆడించేవాడు అందరూ వాళ్లకు సంబందించిన వాళ్ళే ఉంటారట. బయటవాళ్ళెవరూ ఉండరు. అంతా కూడా ఒక టీంగా ఫార్మ్ ఐపోయి టూరిస్టుల అటెంషన్ ని తమ వైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కాయ్ రాజా కాయ్ గేమ్. ఐతే టూరిస్టులకు ఇవన్నీ తెలీక డబ్బులు కాస్తూ ఉంటారు. కానీ అలా డబ్బులు కాస్తే మాత్రం బొక్కే కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని అక్కడ జరిగే విషయాన్నీ వీడియో తీసి అప్ లోడ్ చేసి అక్కడికి వెళ్లే టూరిస్టులను అలెర్ట్ చేసింది. ఇక ఈమె పోస్ట్ చేసిన వీడియోకి కామెంట్స్ వెల్లువెత్తాయి. "చాలా త్వరగా ఈ స్కాం గేమ్స్ ని పసిగట్టి అలెర్ట్ చేశారు. పాపం ఇవన్నీ తెలీక చాలా మంది టూరిస్టులు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. మీరు విరూపాక్ష మూవీలో సూపర్ గా చేశారు" అని అన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శోభకృత్ ఉగాది వేడుకల్లో భాగంగా లండన్ వెళ్లిన శ్యామల అక్కడి విషయాలను తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంది.