English | Telugu

మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య!

-సూర్య తదుపరి చిత్రాలు ఏవి?
కరుప్పు ఎప్పుడు?
వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ డీటెయిల్స్
వివేక్ ఆత్రేయ కథ నచ్చిందా!

పాన్ ఇండియా ట్రెండ్ అనే వర్డ్ పెద్దగా ప్రాచుర్యంలోకి రానప్పుడే సూర్య(Suriya)పాన్ ఇండియా హీరోగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. కానీ గత కొంతకాలంగా వరుస పరాజయాలని ఎదుర్కొంటు అభిమానులని, ప్రేక్షకులని నిరాశపరుస్తు వస్తున్నాడు. పెర్ ఫార్మెన్స్ పరంగా సూర్య మెప్పిస్తున్నా కథ, కథనాల్లోని లోపాల వల్ల సదరు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.అందుకే కథ, దర్శకుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.


సూర్య ప్రస్తుతం 'ఆర్ జె బాలాజీ'(RJ Balaji)దర్శకత్వంలో కరుప్పు(Karuppu)మూవీ చేస్తున్నాడు. యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతుండగా ప్రచార చిత్రాలతో మూవీపై అంచనాలు పెరిగాయి. షూటింగ్ చివరి దశలో ఉండగా వచ్చే ఏడాది ప్రారంభంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు దర్శకుడు లక్కీ భాస్కర్ ఫేమ్ 'వెంకీ అట్లూరి'(Venki Atluri)తో చేస్తున్న మూవీ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సూర్య మరో తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా సూర్య కి వివేక్ స్టోరీ లైన్ చెప్పాడని,సూర్య కి నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసి తీసుకురమ్మన్నాడనే చర్చ సినీ సర్కిల్స్ లో జరుగుతుంది.


Also read:వారణాసి లో నీ రెమ్యునరేషన్ ఎంత.. పట్టిచ్చుకోవడమంటే ఇది

విభిన్న సబ్జెట్స్ ని డీల్ చేసే దర్శకుడిగా వివేక్ ఆత్రేయ(Vivek Athreya)కి మంచి గుర్తింపు వచ్చింది.బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. దీంతో సూర్య కి ఎలాంటి సబ్జెక్టు చెప్పాడనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .