వారణాసి లో నీ రెమ్యునరేషన్ ఎంత.. పట్టించుకోవడమంటే ఇది
on Nov 20, 2025

-బడ్జెట్ ఎంత
-మహేష్ డ్యూయల్ రోల్ నిజమేనా
-వారణాసి రాక కోసం ఎదురుచూపులు
-రెమ్యునరేషన్స్ ఎంత!
మహేష్ బాబు(Mahesh Babu),రాజమౌళి(Rajamouli),ప్రియాంక చోప్రా(Priyanka Chopra)పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి'(Varanasi)పై సినీ ప్రేమికుల దృష్టి పడింది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై 'వారణాసి' అడుగుపెట్టేంత వరకు అప్ డేట్స్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉంటారు.అంతలా వారణాసి రోజు రోజుకి తన క్రేజ్ ని పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా 'మందాకినీ' అనే రోల్ లో చేస్తున్నందుకు సుమారు 30 కోట్లరూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ న్యూస్ వస్తుండటంతో అందరు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మేకర్స్ ఆమెకి అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం, ప్రియాంక చోప్రా ఇప్పుడు పాన్ వరల్డ్ నటిగా ఉంది. గత కొన్నేళ్లుగా హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది. అభిమాన ఘనం కూడా ఎక్కువే. బాలీవుడ్ లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.అందుకే మేకర్స్ 30 కోట్లు ఇచ్చి ఉంటారనే మాటలు వినపడుతున్నాయి. ప్రియాంక చోప్రా హస్బెండ్ నిక్ జోనాస్ హాలీవుడ్ లో పేరు మోసిన పాప్ సింగర్ అనే విషయం తెలిసిందే.
Also Read: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించని ఇద్దరు అతిధులు! ఫ్యాన్స్ ఏమంటారో మరి
ఇక రెమ్యూనరేషన్స్ విషయంలోనే మహేష్, రాజమౌళి ఎంత తీసుకుంటారనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. వారణాసి భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. చిత్ర వర్గాలు అధికారకంగా ప్రకటించకపోయినా 1500 కోట్ల రూపాయల బడ్జెట్ అని టాక్. రుద్రగా మహేష్, మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కుంభ అనే క్యారక్టర్ లో కనిపిస్తున్నారు. 2027 లో ప్రేక్షకుల ముందుకు రానుండగా మహేష్ బాబు డ్యూయల్ రోల్ అనే టాక్ కూడా చాలా బలంగా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



