English | Telugu
సమంతా సుక్కుకు హ్యాండ్ ఇచ్చిందా!?
Updated : Feb 15, 2023
గత కొంతకాలంగా హీరోయిన్ సమంత ఇటు వైవాహిక జీవితం పరంగాను అటు ఆరోగ్య పరంగాను పలు సమస్యలను ఎదుర్కొంటుంది. నాగచైతన్యత విడిపోవడం మరోవైపు మయోసైటీస్ వ్యాధి రావడంతో ఆమెకు తీవ్ర ఇబ్బందులను కలిగించాయి. అయితే ఆమె అనారోగ్యం నుండి ఇప్పుడిప్పుడే కోలు కుంటుందని సమాచారం. ఆమె కేరళ వైద్యంతో పాటు ఇతర స్పెషలిస్ట్ వైద్యుల చేత కూడా చికిత్స చేయించుకుంటుంది. తాజాగా ఆమె శాకుంతలం చిత్రం పూర్తి చేసింది. త్వరలో విజయ్ దేవరకొండ -శివ నిర్వాణ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి చిత్రంలో పాల్గొనబోతోంది.
ప్రస్తుతం ఈమె ముంబైలో ఉంటుంది. అక్కడ ఖరీదైన ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ కొనుగోలు చేసిందని సమాచారం. తనతో ది ఫ్యామిలీ మెన్ వంటి వెబ్ సిరీస్ తీసి తనను నేషనల్ వైడ్ పాపులర్ చేసిన రాజ్ -డీకే దర్శకత్వ దర్శకద్వయంతో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దాంతో విజయ్ దేవరకొండ అభిమానులు మండిపడుతున్నారు. వారికి సమంతా క్షమాపణలు కూడా చెప్పింది. త్వరలో ఖుషీ చిత్రం షూటింగ్లో పాల్గొంటానని తెలిపింది. ఈమె నటించిన పుష్పా చిత్రంలోని ఊ అంటావా మామ ఊఊ అంటావా పాట ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో పుష్ప 2 ది రూల్ చిత్రంలో అంతకుమించిన మంచి ఐటెం సాంగ్ ను సిద్ధం చేసిన సుకుమార్ సమంతాను కలిసి సెకండ్ పార్ట్ లో కూడా ఓ ఐటమ్ సాంగ్ చేయాల్సిందిగా కోరాడట. కానీ దానికి ఆ ఆఫర్ కి సమంత నో చెప్పిందట. గతంలో సుకుమార్ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం చిత్రంలో కూడా సమంత నటించిన విషయం తెలిసిందే. దాంతో సుకుమార్ కి సమంతకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా పుష్ప2లో ఐటం కు సమంత నో చెప్పింది.
అసలు సమంతా నాగచైతన్య ఇద్దరి మధ్య వైవాహిక జీవితంలో విభేదాలు పుష్పాలోని ఐటెం సాంగ్ వల్లనే వచ్చాయనే టాక్ మొదట్లో వినిపించింది దాంతోనే మరోసారి పుష్పా2లో ఐటమ్ సాంగ్ చేస్తే తనపై కేవలం ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్‌గా ముద్ర పడుతుందని ఆమె నో చెప్పినట్లు సమాచారం. మొత్తానికి సమంత సమాధానం సుక్కు అండ్ టీంకు కాస్త నిరాశనే మిగిలిచ్చిందని చెప్పాలి.