English | Telugu
మాస్ అంటే బస్ పాస్ కాదంట...!
Updated : Jan 27, 2014
రవితేజ హీరోగా నటిస్తున్న "పవర్" చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను రవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజతో అదిరిపోయే మాస్ డైలాగ్స్ ను చెప్పిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ టీజర్ లో "మాస్ అంటే బస్సుపాస్ కాదుబే.. ఎవ్వడుపడితే వాడు వాడేసుకోనీకి! గది మన బలుపుని బట్టి, బాడీ లాంగ్వేజిని బట్టి జనం పిలుచుకునే పిలుపు" అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కి మంచి స్పందన వస్తుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.