English | Telugu
నాని బాటలో శర్వానంద్!
Updated : Feb 21, 2023
శర్వానంద్... ఈ యంగ్ హీరో త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నారు. పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాడని భావిస్తే ఈయన మాత్రం కొత్త సినిమాలు ఒప్పుకుంటూ ఉన్నారు. గత ఏడాది ఈయన నటించిన ఒకే ఒక జీవితం చిత్రం మంచి హిట్ సాధించింది. అంతకుముందు ఆయనకు వరుసగా ఐదు ఫ్లాప్లున్నాయి. రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం, ఆడాళ్ళు మీకు జోహార్లు వంటి చిత్రాలను ఆయన చేశారు. ఇవన్నీ సరైన ఫలితం ఇవ్వలేదు.
అయితే ఒకే ఒక్క జీవితం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. కాగా శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. శర్వానంద్ త్వరలో శ్రీరామాదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. దాంతోపాటు తనకు ఫ్లాఫ్ నిచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది నిజమేనా అంటే అవుననే వినిపిస్తోంది. రీసెంట్ గా కిషోర్ తిరుమల శర్వానందు కలిసి కథ చెప్పడం జరిగింది. రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సతమతమవుతున్న కిషోర్ తిరుమల శర్వానంద్ మీద పూర్తి నమ్మకం పెట్టుకుని ఉన్నాడని సమాచారం.
ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు అనే విషయం త్వరలో తెలుస్తుంది. నాని కూడా ఇటీవలే అంటే సుందరానికి వంటి ఫ్లాప్ వివేక్ ఆత్రేయకు వచ్చింది. కానీ హీరో నాని మాత్రం ఏమాత్రం జంకకుండా మరోసారి ఆయనతో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాని ఏకంగా భారీ చిత్రాల నిర్మాత, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాని నిర్మించిన దానయ్య నిర్మిస్తూ ఉండటం విశేషం. ఇప్పుడు అదే తరహాలో శర్వానంద్ కూడా ఆడాళ్లు మీకు జోహార్లు వంటి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడైన కిషోర్ తిరుమల తో మరో చిత్రం చేయనుండటం చూస్తే కాస్త ఆశ్చర్యం వేయక మానదు.