English | Telugu

మహేష్ చేతిలో SSMB28 నైజాం రైట్స్!

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే చిత్రం రూపొందుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్‌లో 12 ఏళ్ల గ్యాప్ తర్వాత రూపొందుతున్న ఈ చిత్రం హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇక ఈ తాజా చిత్రంలో పూజా హెగ్డే, శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ కోసం పెద్ద పోటీ నెలకొని ఉంది. నైజాం ఏరియాలో పంపిణీ కోసం దిల్ రాజు నిర్మాత ఎస్ రాధాకృష్ణకు 50 కోట్ల ఆఫర్ ఇచ్చాడట.

అదే సమయంలో ఏషియన్ సునీల్ అండ్ సిండికేట్ 48 కోట్లకి అడుగుతున్నారు. ఈ ఇద్దరితోనూ నిర్మాత ఎస్ రాధాకృష్ణకు, సూర్యదేవ‌ర‌ నాగవంశీకి మంచి స‌త్సంబంధాలే ఉన్నాయి. అయితే మొదటినుంచి వారు తమ చిత్రాలను దిల్ రాజుకే ఇస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు చిత్రం విషయానికి వస్తే మహేష్ బాబు ఏషియన్ సునీల్ తో కలిసి బిజినెస్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏషియన్ సునీల్ తెరపైకి వచ్చారు. మహేష్ బాబుతో వ్యాపార భాగస్వామి కావడం వల్ల ఈ చిత్రం హక్కులు దిల్ రాజుకు కాకుండా ఏషియన్ సునీల్ కు వెళ్లిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

అయితే ఏషియన్ సునీల్ కంటే దిల్ రాజు రెండు కోట్లు ఎక్కువ అంటే 50 కోట్లకు తీసుకుంటానని ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహేష్ మాట కోసం రెండు కోట్ల నష్టాన్ని భరించడానికి చిన్న బాబు సిద్ధంగా ఉన్నాడా? మ‌హేష్ ఏషియ‌న్ సునీల్ కి ఇవ్వ‌మంటే ఇస్తాడా? అనేది అసలు ప్రశ్న. మొత్తానికి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చాలా కాలం పట్టే అవకాశం ఉంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.