English | Telugu
సుధ కొంగరతో సూర్య కొత్త సినిమా!
Updated : Jun 11, 2023
నేషనల్ అవార్డ్ విన్నర్ సూర్య చేతిలో ఇప్పుడు లెక్కకుమిక్కిలి సినిమాలున్నాయి. అవి కూడా చిన్నా చితకా సినిమాలు కాదు. అన్నీ పెద్ద పెద్ద సినిమాలే. ప్రస్తుతం దరువు శివ దర్శకత్వంలో కంగువ చిత్రంలో నటిస్తున్నారు సూర్య. ఈ ఎగ్జయిటింగ్ ఫాంటసీ సినిమాను త్రీడీలో 10 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఒకటీ,రెండూ కాదు, చాలా వేషాల్లో కనిపిస్తారట సూర్య.
ఓ వైపు ఇది చేస్తూనే మేవరిక్ డైరక్టర్ వెట్రిమారన్ మూవీని లైన్‌లో పెట్టారు సూర్య. వారిద్దరి కాంబోలో వచ్చే వాడివాసల్ కోసం జనాలు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2020లో అనౌన్స్ అయింది ఈ సినిమా. సినిమా టైటిల్ కొత్తగా ఉండటం, వెట్రిమారన్ - సూర్య కాంబో అనడంతో జనాల్లో ఆసక్తి పెరిగింది. కంగువ తర్వాత సూర్య వాడివాసల్ షూటింగ్‌కే హాజరవుతారని వార్తలొచ్చాయి.
ఈ ఏడాది అక్టోబర్‌కి కంగువకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయి. సూర్య కంప్లీట్‌గా ఆ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ అయిపోతారు. జస్ట్ ప్రమోషన్లకు అటెండ్ అయితే సరిపోతుంది. అందుకే నెక్స్ట్ వెట్రిమారన్‌ని సిద్ధంగా ఉండమని సిగ్నల్స్ ఇచ్చారు. అయితే వెట్రిమారన్ ఇప్పుడు సారీ చెబుతున్నారు. ఆయన డైరక్షన్‌లో 'విడుదలై' సినిమా సీక్వెల్ రూపొందుతోంది. విడుదలై 2 షూటింగ్ పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పడుతుందట. ఆ తర్వాతే మళ్లీ సూర్య సినిమా కోసం అన్నీ రెడీ చేయగలరట. ఈ విషయాన్ని సూర్యకి కన్వే చేశారట వెట్రిమారన్.
కంగువకి వాడివాసల్‌కి మధ్య ఉన్న గ్యాప్‌ని ఏం చేయాలా? అని ఆలోచించిన సూర్యకి మంచి ఐడియా తట్టిందట. ఆల్రెడీ సుధ కొంగర చెప్పిన ఓ కథను పాలిష్ చేయమని హింట్ ఇచ్చారు. ఆకాశం నీ హద్దురా కైండ్ సినిమా చేసిన సుధ, ఇప్పుడు సూర్య సరికొత్త ప్రాజెక్టును ఫైనల్ చేసే పనుల్లో ఉన్నారు. సో అనూహ్యంగా ఇప్పుడు సుధకి సూర్య నుంచి బంపర్ లాటరీ తగిలినట్టు అయింది.
ఆకాశం నీ హద్దురా సినిమాకు మ్యూజిక్ చేసిన జీవీ ప్రకాష్ ఈ సినిమాకు కూడా సంగీతం చేయనున్నారు.