English | Telugu

పాత హీరోయిన్ల‌ను ప‌ట్టుకొస్తున్న ద‌ళ‌ప‌తి!

సినిమా అంటేనే కొత్త‌గా ఉండాలి. త‌మ ఫేవ‌రేట్ హీరో ప‌క్క‌న సూప‌ర్ డూప‌ర్ క‌ల‌ర్‌ఫుల్ హీరోయిన్ క‌నిపిస్తే ఆ మ‌జా వేరుగా ఉంటుంది. ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్ కూడా ఇలాగే కోరుకుంటారు. అయితే వారి కోరిక‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేదు విజ‌య్‌. త‌న సినిమాలో వెతికి వెతికి పాత హీరోయిన్ల‌ను ప‌ట్టుకొచ్చి ఛాన్సులు ఇస్తున్నారు. విక్ర‌మ్ లాంటి సినిమా హిట్ త‌ర్వాత లోకేష్ తీస్తున్న సినిమా, వార‌సుడులాంటి విజ‌యం త‌ర్వాత విజ‌య్ న‌టిస్తున్న మూవీ కావ‌డంతో ఎక్స్ పెక్టేషన్స్ నేచుర‌ల్‌గానే ఒక రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో న‌టిస్తున్న హీరోయిన్ల విష‌యంలో మాత్రం అభిమానులు హ్యాపీగా లేరు.

విజ‌య్ ప‌క్క‌న చాలా ఏళ్ల త‌ర్వాత హీరోయిన్‌గా త్రిష న‌టిస్తున్నార‌నే వార్త అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ అయింది. దానికి త‌గ్గ‌ట్టే లియో ఓపెనింగ్‌లోనూ హ‌ల్‌చ‌ల్ చేశారు త్రిష‌. క‌శ్మీర్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో ఆమెతో పాటు ఇంకో ఇద్ద‌రు హీరోయిన్లు కూడా న‌టించ‌నున్నారు. వారిలో ఒక‌రు ప్రియా ఆనంద్‌. మ‌రొక‌రు మ‌డోనా సెబాస్టియ‌న్‌.

అప్పుడెప్పుడో రానా కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన లీడ‌ర్ మూవీలో హీరోయిన్ ప్రియా ఆనంద్‌. పోనీ వ‌రుస విజ‌యాల మీద ఉందా అంటే అదీ లేదు. అయినా విజ‌య్ మూవీలో ఛాన్స్ ఇవ్వ‌డ‌మేంటి? అని అంటున్నారు ఫ్యాన్స్. పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేని కేర‌క్ట‌ర్ అయి ఉంటుందిలే అని త‌మ‌లో తాము స‌ర్దిచెప్పుకుంటున్న‌వారూ ఉన్నారు.

అటు మడోనా సెబాస్టియ‌న్ విష‌యంలోనూ ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్న టైమ్‌లో మ‌డోన్నాలాంటి వాళ్ల ఫేమ్ స‌రిపోదేమో అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

లియో సినిమాను బ్ల‌డీ స్వీట్ అంటూ ప్ర‌మోట్ చేస్తున్నారు. సంజ‌య్ ద‌త్‌, అర్జున్‌, గౌత‌మ్ మీన‌న్‌, మిస్కిన్‌, కొరియోగ్రాఫ‌ర్ శాండీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవ‌ల్లో అక్టోబ‌ర్ 19న విడుద‌ల కానుంది. విజ‌య్ లియో.