English | Telugu
రివెంజ్ తీర్చుకున్న ధనుష్!
Updated : Feb 25, 2023
కోలీవుడ్ స్టార్ ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన నటనలో నేటి తరం వారందరికీ అందనంత ఎత్తులో ఉంటారు. ఆయన నటించే చిత్రాలు ఆయనలోని నటుడిని బయటకు తీసుకుని వస్తాయి. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. మంచి అద్భుతమైన కథ రావాలి గాని దానికి వందకు రెండు వందల శాతం న్యాయం చేయగలిగిన ప్రతిభ ధనుష్‌లో ఉంది. వేరియేషన్స్ పరంగా నేటి తరంలో ధనుష్‌కు సాటి వచ్చే హీరో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన అసురన్ చిత్రానికి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. నేటి తరం హీరోలలో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న ఏకైక హీరోగా ధనుష్ చరిత్ర సృష్టించాడు. ఈయనకు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ లోనూ అవకాశం వచ్చింది. తాజాగా టాలీవుడ్ లో ఆయన నటించిన సార్ చిత్రం అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
హాలీవుడ్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఆయన తన సత్తా చాటాడు. తనకంటూ ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. అలా నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలు ఎన్నో విజయాలు అందుకున్న ధనుష్ ఈ మధ్యనే చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో 150 కోట్ల ఖర్చు పెట్టి ఓ ఇల్లు నిర్మించుకున్నాడు. పోయెస్ గార్గెన్ అంటే అందరికీ తెలిసిందే. అది చెన్నై అంతటికి రిచెస్ట్ ఏరియా. అక్కడ బడాబడా వారు మాత్రమే ఇల్లు నిర్మించుకుంటారు. జయలలిత రజినీకాంత్ వంటి వారు అక్కడ నివాసం ఉంటారు. అలాంటి కాస్ట్లీ ఏరియాలో ధనుష్ ఏకంగా 150 కోర్టు విలువచేసే ఇంటిని నిర్మాణం చేసుకున్నాడు.
ఈ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది గతంలో ఇక్కడే ధనుష్ తల్లిదండ్రులకు అవమానం జరిగిందట. ఎక్కడైతే తన తల్లిదండ్రులకు అవమానం జరిగిందో అక్కడే 150 కోట్లతో ఇంటిని నిర్మించి అమ్మానాన్నలకు గిఫ్ట్ గా ఇచ్చాడు అని తెలుస్తోంది. అయితే దీనిపై ధనుష్ సన్నిహిత వర్గాలు స్పందించాయి. ధనుష్ ఈ ఇంటిని తన భార్య ఐశ్వర్య కోసం నిర్మించాడు. అయితే ధనుష్ ఆమెతో విడిపోవడంతో ఇప్పుడు ఆ ఇంటిని తన తల్లి పేరు మీద మార్చి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. అంతకుమించి మరోటి లేదని దయచేసి ఇష్టం వచ్చినట్టు కథలు రాయద్దని అంటున్నారు.